ఆపరేషన్ సిందూర్: జక్కన్న పోస్ట్ వైరల్..

ఆపరేషన్ సిందూర్: జక్కన్న పోస్ట్ వైరల్..

Published on May 9, 2025 7:59 PM IST

Operation Sindhoor ss Rajam

ప్రస్తుతం భారతదేశం అంతటా కూడా ఇటీవల జరిగిన పహల్గం ఘటన విషయంలో భారత్ పాకిస్తాన్ కి ఇచ్చిన షాక్ తర్వాత పలు వార్తలు ఈ ఉదయం నుంచి పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయ్యాయి. మరి ఈ వార్తలు వైరల్ అయ్యిన నేపథ్యంలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

భారత్ ఆర్మీకి సంబంధించిన మూమెంట్స్ ఏమన్నా మీరు చూసినట్టు అయితే వాటిని దయచేసి ఎవరు రికార్డ్ చేసి వాటిని స్ప్రెడ్ చేయొద్దు అని సూచిస్తున్నారు. ఇలా చేసినట్టు అయితే మనం శత్రువులకు హెల్ప్ చేసినవారు అవుతారు. మనం చేసే అలికిడే ప్రత్యర్థి కోరుకుంటున్నాడు. అందుకే అంతా దయచేసి సహనం పాటించి పాజిటివ్ గా ఉండండి విజయం మనదే అంటూ జక్కన్న చేసిన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది.

తాజా వార్తలు