‘వారణాసి’ అంతర్జాతీయ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ సినిమా ప్రస్తావనతో రాజమౌళి.. అసలేమన్నారంటే

‘వారణాసి’ అంతర్జాతీయ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ సినిమా ప్రస్తావనతో రాజమౌళి.. అసలేమన్నారంటే

Published on Jul 21, 2026 9:00 AM IST

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఇప్పుడు గ్లోబల్ దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. బాహుబలి, రౌద్రం రణం రుధిరం (RRR) లాంటి సినిమాలుతో గ్లోబల్ ఫేమ్ అందుకున్న జక్కన్న ఈసారి నేరుగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ తో హాలీవుడ్ మార్కెట్ పైనే కన్నేశారు.

తన ప్రాజెక్ట్ కి తగ్గ పర్ఫెక్ట్ హాలీవుడ్ కటౌట్ సూపర్ స్టార్ మహేష్ బాబుని పట్టుకొని జక్కన్న చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఆల్రెడీ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నాయి. ఇలా ఇటీవల ఫ్రాన్స్ లో జరిగిన ఓ ఇంటరాక్షన్ లో రాజమౌళి చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి.

తను సినిమా చేసే క్రమంలో ఒక దర్శకునిగా తనకి, తన బృందానికి మధ్య ఏ అంశం దగ్గర ఎక్కువ విబేధం వస్తుంది అనే పాయింట్ కి జక్కన్న వివరణ ఇచ్చారు. తన రెండో సినిమా ‘సింహాద్రి’, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసాడు. ఆ సినిమాలో హీరో ఒక మంచి వ్యక్తిని చంపాల్సి వస్తుంది. అది అతనికి తప్పనిసరి.

ఆ మంచి వ్యక్తిని తన హీరో చంపలేదు అంటే వేలమంది అమాయకుల ప్రాణాలు పోతాయి. ఈ సీన్ విషయంలో తనకి తన కుటుంబం, బృందానికి నడుమ జరిగిన చిన్నపాటి యుద్ధం తర్వాత ఆ సీక్వెన్స్ తాలూకా బలమైన ఎమోషన్ విలువని ప్రెజెంట్ చేశామని సీన్ కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది అని గ్లోబల్ స్టేజ్ పై తెలిపారు. దీనితో ఈ కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో, అభిమానుల్లో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు