‘మహేష్ – త్రివిక్రమ్’ సినిమా క్రేజీ అప్ డేట్ !

Published on Jun 5, 2021 10:42 pm IST

‘సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్’ కలయికలో రానున్న సినిమా షూట్ పై ఒక లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. షెడ్యూల్స్ మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా షూటింగ్ ను పూర్తి చేయాలని, వచ్చే ఏడాదికి సమ్మర్ కి స్పెషల్ గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు.

ఈ చిత్రంలోని కీలకమైన భాగాన్ని ‘యూకే’లో చిత్రీకరించబోతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ నుండి టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ‘శిల్పా శెట్టి’ నటిస్తోందని ఇప్పటికే రూమర్స్ వచ్చాయి. మొత్తానికి త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్‌ ని పెడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే నదియా, ఖుష్బూ, దేవయాని, టబు, ఇప్పుడు శిల్పా శెట్టి.

ఈ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుంది. ఇక పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :