లేటెస్ట్: “SSMB28” రిలీజ్ డేట్ ఫిక్స్..!

లేటెస్ట్: “SSMB28” రిలీజ్ డేట్ ఫిక్స్..!

Published on Aug 18, 2022 5:25 PM IST

Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం SSMB 28. ఈ చిత్రం కి ఇంకా టైటిల్ ను ఖరారు చేయాల్సి ఉంది. సర్కారు వారి పాట మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తర్వాత మహేష్ బాబు చేస్తున్న చిత్రం కావడం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్ర. కి సంబంధించిన అప్డేట్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టు గా చిత్ర యూనిట్ నేడు విడుదల తేదీ ను ప్రకటించింది.

ఈ చిత్రం ను వచ్చే ఏడాది సమ్మర్ బరిలో దింపనున్నట్లు చిత్ర యూనిట్ ఒక వీడియో ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం ను ఏప్రిల్ 28, 2023 లో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు