‘సాహసం శ్వాసగా సాగిపో’ నైజాం కలెక్షన్స్!

‘సాహసం శ్వాసగా సాగిపో’ నైజాం కలెక్షన్స్!

Published on Nov 13, 2016 8:39 PM IST

Sahasem-savasaga-sagipo
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ అన్న సినిమా గత శుక్రవారం పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. రొమాన్స్ జానర్లో ‘ఏమాయ చేశావే’ లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ – చైతూల కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ సినిమాపై టీజర్ విడుదలైనప్పట్నుంచే ఎక్కడిలేని అంచనాలు బయలుదేరాయి. ఇక ఆ అంచనాల మధ్యనే విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

కాగా భారత ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడంతో భారీగా డబ్బు కొరత ఏర్పడి ప్రజలంతా సినిమాలకు దూరమయ్యే పరిస్థితి కలిగింది. దీంతో ఈ ప్రభావం ‘సాహసం శ్వాసగా సాగిపో’ కలెక్షన్స్‌పై కూడా పడింది. అయినప్పటికీ నైజాం ప్రాంతంలో రెండు రోజుల్లో ఈ సినిమా 1 కోటి 40 లక్షల రూపాయలు వసూలు చేయడం విశేషంగా చెప్పుకోవాలి. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ భావిస్తోంది.

తాజా వార్తలు