నిర్మాతగా మారబోతున్న స్టార్ యాక్టర్ !

నిర్మాతగా మారబోతున్న స్టార్ యాక్టర్ !

Published on Aug 15, 2018 11:28 PM IST


ఫ్యామిలీ హీరో జగపతి బాబు హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత వరుస సినిమాలతో ప్రస్తుతం దక్షిణాది చలన చిత్ర పరిశ్రమల్లోనే ప్రధాన పాత్రలతో విలన్ పాత్రలతో బిజీగా ఉన్నారు. కాగా ఇప్పుడు ఆయన నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మారనున్నారట.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం జగపతిబాబు త్వరలో ఓ వెబ్‌ సిరీస్‌ కు నిర్మాతగా వ్యవహరించనున్నారు. జగపతిబాబు తండ్రిగారు వి.బి. రాజేంద్రప్రసాద్‌ గారు కూడా ఆ రోజుల్లో ప్రముఖ నిర్మాత అని తెలిసిన విషయమే. ఇప్పుడు తండ్రి బాటలోనే జగపతిబాబు కూడా నడవనున్నాడన్నమాట. అయితే ఆ వెబ్ సిరీస్ కు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జగపతిబాబు, ఎన్టీఆర్ ‘అరవింద సమేత’లో, చిరంజీవి సైరా లో, మరియు వైయస్ బయోపిక్ ‘యాత్ర’ చిత్రంలో ఇలా భారీ చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు