ఇండియాకు మెడల్ తెచ్చిన ప్రముఖ నటుడి కుమారుడు !

ఇండియాకు మెడల్ తెచ్చిన ప్రముఖ నటుడి కుమారుడు !

Published on Apr 10, 2018 1:24 AM IST

madhavan son

ఒకప్పటి స్టార్ హీరో, ప్రస్తుతం పలు సినిమాల్లో ప్రముఖ పాత్రలు చేస్తూ మంచి ఫలితాల్ని అందుకుంటున్న ప్రముఖ నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ ఇండియాకు పతాకాన్ని తెచ్చిపెట్టాడు. థాయ్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో ఇండియా తరపున పాల్గొన్న వేదాంత్ కాంస్య పతాకాన్ని సాధించాడు.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన మాధవన్ ఇది తనకు, తన భార్య సునీతకు గర్వించదగిన విషయమని, తమ కుమారుడు వేదాంత్ అంతర్జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో కాంస్యం గెలిచాడని అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇకపోతే ఇటీవలే అమెజాన్ వెబ్ సిరీస్ ‘బ్రీత్’ తో ప్రేక్షకుల్ని పలకరించిన మాధవన్ షూటింగ్ దశలో ఉన్న నాగ చైతన్య, చందూ మొండేటిల ‘సవ్యసాచి’ సినిమాలో ఒక కీ రోల్ ప్లే చేస్తున్నారు.

తాజా వార్తలు