పవన్ – త్రివిక్రమ్ సినిమాలో అలనాటి స్టార్ హీరోయిన్ !

28th, December 2016 - 09:03:05 AM

pawan-kushbu-m

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైన్ చేసిన సినిమాల్లో త్రివిక్రమ్ చిత్రం కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ పై సినీ, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా, అత్తారింటికి దారేది’ సినిమాల్లాగే ఈ చిత్రం కూడా భారీ విజయం సాధించడం ఖాయమని అందరూ ధీమాగా ఉన్నారు. వారి అంచనాలకు తగ్గట్టే త్రివిక్రమ్ ఈ చిత్రం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాలో అలనాటి నటి, తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన కుష్బును కూడా నటింపజేస్తున్నారు.

ఈ విషయాన్ని కుష్బు స్వయంగా తెలిపారు. ‘9 సంవత్సరాల తరువాత తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాను. త్రివిక్రమ్ చెప్పిన స్క్రిప్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఇందులో నా క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. నా చివరి తెలుగు చిత్రం మెగా స్టార్ చిరంజీవి స్టాలిన్. మళ్ళీ ఇప్పుడు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాత్రకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను. అభిమానులను నిరుత్సాహపరచను’ అన్నారు. ఇకపోతే ఈ సినిమా 2017 ఫిబ్రవరి నుండి మొదలయ్యే అవకాశముంది.