భారతీయ సినిమాల పై అమెరికన్ పాట వైరల్ !

భారతీయ సినిమాల పై అమెరికన్ పాట వైరల్ !

Published on Aug 10, 2020 1:14 PM IST

‘బ్లాక్ ఐడ్ పీస్’.. ఇండియన్ సినిమాల్లోని యాక్షన్ సినిమాల పై ఓ ఇంట్రస్టింగ్ కొత్త మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది. బ్యాండ్ లోని ప్రధాన గాయకుడు విల్.ఐ.ఎమ్, పలు ప్రముఖ సినిమాలైన మర్యాద రామన్న (2010), రోబో (2010), అంబాలా (2015), కోప్స్ (2003), సింగం (2011) సినిమాల్లోని పలు యాక్షన్ సన్నివేశాలను ఎడిట్ చేసి రూపొందించారు. రజనీకాంత్ తో స్టార్ ఆయిన్ ఈ వీడియో, అజయ్ దేవ్‌గన్ ను, సునీల్ ను చాలా బాగా ఎడిట్ చేశారు. ‘యాక్షన్’ అనే పేరుతో వచ్చిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వారు ఈ వీడియోను రూపొందించడానికి ‘డీప్ ఫేక్ టెక్నాలజీ’ ను ఉపయోగించినందున ఇది చూడటానికి చాల ఎంటర్ టైన్ అనిపిస్తుంది.

కాగా బ్లాక్ ఐడ్ పీస్ వారి యూట్యూబ్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ఇండియన్ సినిమా నుండి వారు ఎంత ప్రేరణ పొందారో దాని గురించి రాస్తూ.. “బ్లాక్ ఐడ్ పీస్.. మా కెరీర్ ప్రారంభం నుండి భారతీయ సంస్కృతి నుండి ప్రేరణ పొందుతూనే ఉన్నాం … ఆశా భోంస్లే నుండి ఎఆర్ రెహమాన్ వరకూ, భారతీయ సంగీతం ఎన్నో సందర్భాలలో మా పాటలను ప్రభావితం చేసింది. మేము చేసిన ఈ వీడియో భారతీయ సంగీతం పై మా ప్రేమను చూపిస్తుంది. అలాగే బాలీవుడ్ లో తెరపైకి వచ్చే యాక్షన్ అద్భుతం. భారతదేశంకు ధన్యవాదాలు అని పోస్ట్ చేశారు.

Click here for Black Eyed Peas – ACTION video

సంబంధిత సమాచారం

తాజా వార్తలు