దర్శకుడు క్రిష్ ‘నటరత్న’ ఎన్టీఆర్ జీవితకథను తెరకెక్కించబోతున్న విషయం తేలింసిదే. బాలకృష్ణ ప్రధానపాత్రను పోషించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 5 నుంచి షూటింగ్ కి వెళ్లనున్న ఈ చిత్రంలోని ముఖ్యమైన పాత్రల కోసం ఇప్పటికే విద్యాబాలన్ ను, రానాను, సచిన్ కేడెకర్ ను ఎంపిక చేశారు. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో మహేష్‌బాబును, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగ చైతన్యను నటింపజేయనున్నారని తెలుస్తోంది.
అలాగే సీనియర్ నటుడు మోహన్‌బాబు ఎన్టీఆర్ బయోపిక్ లో నటించనున్నారు. ‘మహానటి’లో ఎస్వీఆర్ పాత్రలో నటించిన ఆయన, ఈ చిత్రంలోనూ అదే పాత్రలో కనిపించే అవకాశం ఉంది. స్వతహాగా ఎన్టీఆర్‌కి వీరాభిమాని అయిన మోహన్‌బాబు ఈ చిత్రం కోసం ఎప్పుడు పిలిచినా వచ్చి నటిస్తానని అన్నారని సమాచారం. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఆయన తండ్రి హరికృష్ణ పాత్రలో కనిపియించనున్నారు. హీరో రాజశేఖర్ కూడా ‘ఎన్టీఆర్’లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఆయన చేత ఏ పాత్ర చేయిస్తే బాగుంటుందో అని దర్శక నిర్మాతలు ఇంకా ఓ అవగాహనకి రాలేదని తెలుస్తోంది.


