‘డిస్కో రాజా’తో అల్లరి నరేష్.. ఫిక్స్ అయ్యాడు !

‘డిస్కో రాజా’తో అల్లరి నరేష్.. ఫిక్స్ అయ్యాడు !

Published on Jun 10, 2019 11:38 AM IST

ఇటీవలే విడుదలై ఘన విజయాన్ని అందుకున్న చిత్రం ‘మహర్షి’. ఇందులో అల్లరి నరేష్ రవి అనే కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. అందులో ఆయన నటనకుగాను మంచి ప్రశంసలు అందాయి. దీంతో ఆయనకు ఇలాంటి సపోర్టింగ్ రోల్స్ అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని, రవితేజ చేస్తున్న ‘డిస్కో రాజా’లో ముఖ్యమైన పాత్ర కోసం దర్శకుడు విఐ ఆనంద్ ఆయన్ను సంప్రదించారని వార్తలు వచ్చాయి. కాగా తాజాగా నరేష్ ‘డిస్కోరాజా’ నటించబోతున్నట్లు తెలిపారు.

ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మ‌రో హీరోయిన్ ఎంపిక ఇంకా జ‌ర‌గాల్సి వుంది. నిర్మాత‌ రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు