సినిమాల విజయంలో కీలక పాత్రను పోషిస్తున్న స్టార్ కమీడియన్!

సినిమాల విజయంలో కీలక పాత్రను పోషిస్తున్న స్టార్ కమీడియన్!

Published on Aug 16, 2018 4:00 PM IST

‘వెన్నెల’ చిత్రం తో తెలుగు తెరకు పరిచయమైన నటుడు వెన్నెల కిశోర్. ఆ చిత్రం విజయం సాధించటంలో ఆయన చేసినకామెడీ కీలక పాత్రను పోషించింది. ఇక ఈ చిత్రం తరువాత సుమారు 4సంవత్సరాలు విరామం తీసుకొన్న కిశోర్ కు ‘కరెంట్, బిందాస్’ చిత్రాలు టర్నింగ్ పాయింట్ గా నిలిచాయి. ఇక అక్కడినుండి ఆయన వెనుతిరిగి చూసుకోలేదు.

ఈమధ్య కాలంలో సినిమాలు విజయం సాధించడంలో ఆయన కీలక పాత్రను పోషిస్తున్నారు . మహానుభావుడు సినిమా నుండి నిన్నటి చి ల సౌ, గీత గోవిందం చిత్రాలలో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఆయన హాస్య బ్రహ్మ బ్రహ్మనందం ను రీప్లేస్ చేయడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు. దర్శకులు కూడా వెన్నెల కిశోర్ ను దృష్టిలో పెట్టుకొని పాత్రలు రాయడం మొదలుపెట్టారు. ముందు ముందు కిశోర్ లేని సినిమాఅంటూ ఉండదేమో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు