నూతన దర్శకుడు డి.రామకృష్ణ దర్శకత్వంలో కమెడియన్ సప్తగిరి హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం ‘గజదొంగ’. ఇప్పటికే సప్తగిరి ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’, ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ చిత్రాల్లో హీరోగా నటించాడు.ఇప్పుడు గజదొంగ చిత్రంతో మళ్ళీ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
కాగా, ఈ సారి సప్తగిరి కామెడీ మూవీ కాకుండా యాక్షన్ ప్రధానంగా సాగే ఎంటర్టైనర్ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ కథ విలేజ్ మరియు టౌన్ నేపథ్యంలో ఉంటుందట. ఆగస్టు మొదటి వారంలో షూట్ కి వెళ్ళబోతున్న ఈ చిత్రాన్ని నంద నందనా ప్రాజెక్ట్స్ బ్యానర్ పై శర్మ చుక్కా, యెడల నరేంద్ర నిరించనున్నారు.


