స్టార్ కమెడియన్ కి మాతృ వియోగం !

Published on Jul 17, 2019 4:07 pm IST

ప్రముఖ కమెడియన్ వివేక్ కు మాతృ వియోగం. తమిళ సినీపరిశ్రమకి చెందిన వివేక్ ఎన్నో సూపర్ హిట్ తమిళ్ సినిమాల్లో తనదైన నటనతో నవ్వులు పూయించారు. పైగా ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. కాగా ఆయన తల్లి ఈ రోజు చెన్నైలో కన్నుమూశారు. వయసు పై బడటం కారణంగా ఆమె గత కొంతకాలంగా పలు అనారోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతోంది. దాంతో ఆమె నేడు కన్నుమూసింది.

అయితే కొన్నేళ్ల క్రితం తన కొడుకును కోల్పోయిన వివేక్‌ కు.. ఈ సంఘటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆవిడ అంత్యక్రియలు చెన్నైలోని ఈ రోజు సాయంత్రం జరపనున్నట్లు తెలుస్తోంది. 123తెలుగు.కామ్ తరఫున ఆవిడ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం :

X
More