‘మెగాస్టార్ అల్లుడు’ రెండో చిత్రానికి ఆ స్టార్ డైరెక్టర్ ?

‘మెగాస్టార్ అల్లుడు’ రెండో చిత్రానికి ఆ స్టార్ డైరెక్టర్ ?

Published on Jun 24, 2018 9:14 PM IST


మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు ‘కళ్యాణ్ దేవ్’ హీరోగా విజేత అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగత తెలిసిందే. ఈ చిత్రం ఈ రోజు ఆడియో ఫంక్షన్ కూడా జరుపుకుంటుంది. ప్రేక్షకుల్లో ఈ ‘విజేత’ చిత్రం మీద అంచనాలను పెంచటానికి ఏకంగా మెగాస్టారే ఆడియో ఫంక్షన్ కి రానున్నారు. కాగా విజేత చిత్రం విజయవంతమవుతుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది. అయితే కళ్యాణ్ దేవ్ రెండో చిత్రానికి కూడా ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. దర్శకుడు హరీష్ శంకర్ అల్లు అర్జున్ తో ఓ చిత్రం చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. కానీ బన్ని శేఖర్ కమ్ములతో చేస్తారని వార్తలు వస్తున్నాయి.

కాగా హరీష్, ఒకవేళ బన్నితో తన సినిమా లేకపోతే, కళ్యాణ్ దేవ్ తో సినిమా చెయ్యటానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. హరీష్ దగ్గర కళ్యాణ్ దేవ్ కి సరిపోయే కథ ఒకటి ఉందట అయితే విజేత చిత్రం విడుదలయ్యాక ఈ చిత్రం గురించి ఏ విషయమైనది నిర్ణయం తీసుకోనున్నారు. ‘కళ్యాణ్ దేవ్’ స్క్రీన్ మీద ఎలా ఉన్నారో చూడటం కోసం మోగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు రాకేష్ శశి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు