ప్రభాస్ తో కొరటాల నిజమేనా ?

ప్రభాస్ తో కొరటాల నిజమేనా ?

Published on Oct 28, 2019 7:57 PM IST

Prabhas2

కొరటాల శివ డైలాగ్ రైటర్ గా కెరీర్ ను మొదలుపెట్టి ప్రభాస్ తో ‘మిర్చి’ సినిమా తీసి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో ఒకరు. అయితే ఆ తరువాత కొరటాల మహేష్ బాబు, ఎన్టీఆర్ లతో సినిమాలు చేశారు గాని, మళ్ళీ ప్రభాస్ తో సినిమా చేయలేదు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ – కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా రానుందని తెలుస్తోంది. రచయితగా ఉన్న కొరటాలకు మొదటిసారి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన ప్రభాస్ కి, మరి కొరటాల ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.

అయితే ప్రభాస్ – కొరటాల సినిమా 2021లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. కాగా ఈ సినిమా స్క్రిప్టు ఫైనల్‌ వెర్షన్‌ జరుగుతోంది. ఇక ఈ సినిమాకి టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారట. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నారు. కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసారని సమాచారం.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు