సిల్క్ స్మిత జీవితం ఆధారంగా వెబ్ సిరీస్ ను నిర్మించనున్న ప్రముఖ దర్శకుడు !
Published on Aug 14, 2018 6:37 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘కబాలి, కాలా’ సినిమాలను తెరకెక్కించాడు యువ దర్శకుడు పా. రంజిత్. ఈ రెండు చిత్రాలు పరాజయాన్ని చవిచూశాయి. ఇక ‘కాలా’ చిత్రం తరువాత రంజిత్ అమిర్ ఖాన్ హీరోగా బాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరక్కించనున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలఫై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలుబడలేదు.

ఇప్పుడు తాజాగా రంజిత్ నిర్మాతగా మారి వెబ్ సిరీస్ ను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడట. అలనాటి నటి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దాదాపుగా సౌత్ తో పాటు హిందీ భాషలో కలిపి 450 చిత్రాల్లో నటించిన సిల్క్ స్మిత 1996లో ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు ఆమె నిజ జీవితాన్ని ఈ వెబ్ సిరీస్ తో ఈతరం ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాడు దర్శకుడు పా. రంజిత్.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook