‘కంచరపాలెం’ను చూడాలంటున్న స్టార్ డైరెక్టర్ !

‘కంచరపాలెం’ను చూడాలంటున్న స్టార్ డైరెక్టర్ !

Published on Aug 18, 2018 5:40 PM IST

కంచరపాలెం అనే గ్రామం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం’కేరాఫ్ కంచరపాలెం’. నూతన దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆ ఊరి వాళ్లే నటించడం విశేషం సినిమా షూటింగ్ కూడా అక్కడే జరిగింది. ఈ చిత్రం రానా దగ్గుబాటి బాగా నచ్చడంతో ఈసినిమాను సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈచిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక తాజాగా ఈ చిత్రాన్ని చూసిన టాప్ డైరెక్టర్ రాజమౌళి ప్రతి ఒక్కరిని ఈచిత్రం చూడాల్సిందిగా కోరారు. సినిమా చూసిన వారం,పది రోజుల తరువాత కూడా ఈ చిత్రంలోని పాత్రలు మనకి గుర్తొస్తున్నాయి అంటే అది నిజంగా గొప్ప సినిమానే. ఆ లాంటి ఈచిత్రమే ఈ కంచరపాలెం. అందరు ఈచిత్రాన్ని చూడాలి అని వీడియో ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈచిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న విడుదల చేయనుంది. స్వీకర్ అగస్థీ సంగీతం అందించిన ఈచిత్రాన్ని పరుచూరి విజయ ప్రవీణ నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు