మహేష్ కోసం స్క్రిప్ట్ వర్క్ మొదలెట్టిన స్టార్ డైరెక్టర్ !

Published on Sep 20, 2019 12:44 am IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత మహేష్ కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయబోతున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. మహేష్ బాబు తన తరువాత సినిమాని దర్శకుడు వంశీ పైడిపల్లితో చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెట్టాడట. ఆల్ రెడీ వంశీ, మహేష్ కి లైన్ చెప్పినట్లు.. మహేష్ ఆ లైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డు ను కూడా బ్రేక్ చేసింది. పైగా ‘మహర్షి’ ప్రతి ఒక్కరికీ మంచి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చే సినిమా అని ప్రముఖుల చేత ప్రశంసలు కూడా పొందింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. అలాగే ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :

X