ఏబిసిడి ట్రైలర్ ను విడుదల చేయనున్న స్టార్ డైరెక్టర్ !

Published on Apr 14, 2019 12:00 pm IST

పలు సార్లు వాయిదాపడ్డ యంగ్ హీరో అల్లు శిరీష్ నటిస్తున్న ఏబిసిడి (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి) ఎట్టకేలకు విడుదలకు సిద్దమవుతుంది. మే 17న ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. ఇక ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ రేపు ఉదయం 9గంటలకు విడుదలచేయనున్నాడు.

మలయాళ సూపర్ హిట్ మూవీ ఏబిసిడి కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుక్సార్ మీర్ హీరోయిన్ గా నటిస్తుండగా సంజీవ్ రెడ్డి డైరెక్టర్ చేస్తున్నాడు. బిగ్ బెన్ సినిమాస్ ,మధుర ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :