గీత గోవిందం ను ప్రశంసించిన స్టార్ డైరెక్టర్ !

గీత గోవిందం ను ప్రశంసించిన స్టార్ డైరెక్టర్ !

Published on Aug 15, 2018 10:25 PM IST

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురాం తెరకెక్కించిన చిత్రం ‘గీత గోవిందం’. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన ని రివ్యూస్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమాను చూసిన అగ్ర దర్శకుడు రాజమౌళి ఈచిత్ర యూనిట్ ఫై ప్రశంసలు కురిపించారు.

అర్జున్ రెడ్డి తరువాత విజయ్ సరైన సినిమాని ఎన్నుకొని అద్భుతంగా నటించాడని అలాగే ఈచిత్రం ఆద్యాంతం సరదాగా సాగుతూ అలరించిందని పరశురామ్ అద్భుతంగా తెరకెక్కించాడని రాహుల్ రామకృష్ణ , అన్నపూర్ణ , వెన్నెల కిశోర్ ల కామెడీ హైలైట్ గా ఉందని ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మించిన ఈచిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు