స్టార్ డైరెక్టర్స్ చేతుల మీదగా మొదలైన యంగ్ హీరో చిత్రం !

Published on Jul 9, 2018 2:22 pm IST

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ పై నిర్మిస్తున్నారు.

కాగా ఈ ఉదయం, ఈ చిత్రం రామానాయుడి స్టూడియోస్ లో అధికారికంగా లాంచ్ అయింది. బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి చిత్రం ‘అల్లుడు శ్రీను’ దర్శకుడు వి.వి. వినాయక్ క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు శ్రీవాస్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ఈ చిత్ర దర్శకుడు తేజా మొదటి షాట్ కు దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు సోనూసూద్ ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :