కాంచన రీమేక్ షురూ !

Published on Apr 24, 2019 7:00 pm IST

రాఘవ లారెన్స్ నటించిన కాంచన 3 ఇటీవల విడుదలై తెలుగు తో పాటు తమిళంలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. నెగిటివ్ టాక్ ను తట్టుకుని ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. ఇక ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేయకుండా లారెన్స్ తన కొత్త సినిమా షూటింగ్ లో బిజీ అవుతున్నాడు.

ముని సిరీస్ లో రెండవ సినిమాగా వచ్చిన మోస్ట్ సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ కాంచనను ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నాడు లారెన్స్. ఈచిత్రం యొక్క షూటింగ్ ముంబై లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఒక సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ , కియరా అద్వానీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘లక్ష్మి’ అనే టైటిల్ ఖరారు చేశారు. మరి తెలుగు , తమిళం బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఆయిన ఈ చిత్రం బాలీవుడ్ లో ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :