‘నా పేరు సూర్య’ వేడుకకు ముఖ్య అతిధిగా స్టార్ హీరో !

ప్రస్తుతం పరిశ్రమలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. స్టార్ హీరోలంతా అవసరంలేని హద్దుల్ని పక్కనబెట్టి స్నేహంగా మెలుగుతున్నారు. ఒకరి సినిమా ఈవెంట్లకి మరొకరు హాజరవుతూ స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచుతూ అభిమానుల్లో సరికొత్త ఉత్తేజాన్ని రేకెత్తిస్తున్నారు. అందుకు నిదర్శనం ఇటీవలే జరిగిన ‘భరత్ అనే నేను’ ఆడియో వేడుక.

ఈ వేడుకకు మహేష్ బాబు ఆహ్వానం మేరకు జూ.ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఇప్పుడు అదే బాటలో త్వరలో జరగనున్న అల్లు అర్జున్ యొక్క ‘నా పేరు సూర్య’ ప్రీ రిలీజ్ వేడుకకు ప్రభాస్ ముఖ్య అతిథిగా రానున్నారని వినికిడి. ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాని ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హడావుడి చేసేస్తోంది. మరి దీనిపై ‘నా పేరు సూర్య’ టీమ్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి. ఇకపోతే బన్నీ, ప్రభాస్ లు ఎన్నాళ్లగానో మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.