కళ్యాణ్ రామ్ సినిమాలో స్టార్ హీరో ?
Published on Jun 25, 2018 8:22 am IST

నందమూరి కళ్యాణ్ రామ్ త్వరలో పవన్ సాతినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఆగష్టులో మొదలుకానుంది. ఈ చిత్ర్రం మల్టీ స్టారర్ గా ఉండనుంది. కళ్యాణ్ రామ్ తో పాటు ఒక స్టార్ హీరో ఇందులో నటించనున్నారట.

తాజా సమాచారం మేరకు ఆ స్టార్ హీరో మరెవరో కాదు కింగ్ నాగార్జున అని తెలుస్తోంది. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించాడు సిద్ధమేనని ఎప్పుడో చెప్పిన నాగార్జున ప్రస్తుతం నానితో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ హై బడ్జెట్ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించనున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook