మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న స్టార్ హీరో సినిమా !

Published on Apr 17, 2019 1:00 am IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా వున్నాడు అందులో ఒకటి కాప్పాన్ కాగా మరొకటి సురరై పోట్రు. కెవి ఆనంద్ తెరకెక్కిస్తున్న కాప్పాన్ ను దాదాపుగా పూర్తి చేశాడు సూర్య. ఈ చిత్రం ఆగస్టు 30న విడుదలకానుంది. ఇక సూర్య ప్రస్తుతం సురరై పోట్రు అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం లాంఛ్ కాగా ఈ రోజు తో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

గురు ఫేమ్ సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తుంది. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఇక సూర్య ఈ రెండు సినిమాల కన్నా ముందు ఎన్ జి కె తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. మే 31న ఈ చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :