కరోనా బాధితుల కోసం ఇంటిని ఇస్తోన్న స్టార్ హీరో !

Published on Mar 25, 2020 8:00 pm IST

కరోనా వైరస్ మొత్తం ప్రపంచంలో ఒక రకమైన భయానిక వాతావరణాన్ని సృష్టించింది. ప్రభుత్వాలతో పాటు సినీ ప్రముఖులు కూడా తమవంతుగా ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో నితిన్ 20 లక్షలు అండ్ కమల్ హాసన్ 10 లక్షలు విరాళంగా ఇచ్చారు. అయితే ఇప్పుడు, కమల్ ఒక అడుగు ముందుకు వేసి, చెన్నైలోని ఎల్డామ్స్ రోడ్ లో ఉన్న తన ఇంటిని తాత్కాలిక ఆసుపత్రిగా మార్చబోతున్నాడు. ప్రభుత్వాలతో పాటు సినీ ప్రముఖులు కూడా కరోనా పట్ల ప్రజలను మరింత అప్రమత్తం చేయడంతో పాటు సహాయ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టడం హర్షించతగ్గ విషయం.

అయితే ఇంకా ఎంతమంది తారలు దేశం కోసం తమ వంతు కృషి చేయడానికి ముందుకు వస్తారో చూడాలి. ఇక కరోనా వైరస్ టాలీవుడ్ పరిశ్రమను టెంక్షన్లో పడేసింది. ఈ వైరస్ కారణంగా షూటింగ్ జరుపుకోవాల్సిన పలు సినిమాలు షెడ్యూల్స్ వాయిదా వేసుకున్నాయి. బంద్ తో పాటు సామాజిక దూరంను దృష్టిలో పెట్టుకుని షూటింగ్ లను మరో నెల పోస్ట్ ఫోన్ చేయాల్సిందిగా ప్రభుత్వాలు సినీ పరిశ్రమని కోరుతున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More