నాని ‘జెర్సీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా.. !

Published on Apr 13, 2019 5:40 pm IST

జీవితంలో అనుకొని పరిస్థితుల కారణంగా ఓటమి అంచుల్లో కూరుకుపోయిన ఓ వ్యక్తి.. తనకు బాగా ఇష్టమైన క్రికెట్ ను ప్రాణంగా భావించి, మళ్లీ జీవితంలో ఎలా గెలిచాడు.. ? ఆ గెలిచే క్రమంలో అతను ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు.. అనే పాయింట్ బేస్ చేసుకొని నాని హీరోగా గౌతం తిన్ననూరి దర్శకత్వంలో ఏప్రిల్ 19న రాబోతున్న సినిమా ‘జెర్సీ’ .

కాగా ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో ఈ నెల 15వ తేదీ సాయంత్రం 7:30 నిముషాలకు జరగనుంది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ రానున్నాడు. ఈ విషయాన్ని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం :