లిక్కర్ బ్రాండ్ కి అంబాసిడర్ గా రవితేజ

ravi-teja
లార్డ్ & మాస్టర్ అనే ప్రముఖ మద్యవిక్రయ సంస్థకి స్టార్ హీరో రవితేజ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. లార్డ్ & మాస్టర్ అనేది ఒక ఫ్రెంచ్ గ్రేప్ బ్రాందీ. ఈ మేరకు షూట్ చేసిన యాడ్ త్వరలో టి.వి లలో ప్రసారంకానుంది. మాస్ లో రవితేజకి మంచి ఫ్యాన్ బేస్ వున్న కారణంగా అతన్ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒక ప్రముఖ చెప్పుల సంస్థకు ఇప్పటికే రవితేజ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.

రవితేజ ప్రస్తుతం కిక్ 2 విడుదలకోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా ఆడియో విడుదలై కొన్ని నెలలుకావస్తున్నా విడుదలతేది ఖరారుకావడంలేదు. రవితేజ ప్రస్తుతం సంపత్ నందితో బెంగాల్ టైగర్ షూటింగ్ లో బిజీగా వున్నాడు.

Exit mobile version