యాక్సిడెంట్ తో భీబత్సం సృష్టించిన స్టార్ హీరో కుమారుడు !

Published on Aug 12, 2018 2:50 pm IST

తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్‌ ‘వర్మ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు హీరోగా రాబోతున్న విషయం తెలిసిందే. తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న ‘అర్జున్‌ రెడ్డి’కి ఈ చిత్రం రీమేక్‌గా రాబోతోంది. అయితే ధ్రువ్‌ కారు రోడ్డు యాక్సిడెంట్ కి గురైంది.

వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం తెల్లవారుజామున చెన్నైలో ధ్రువ్‌ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న మూడు ఆటోలను ఢీ కొట్టింది. దాంతో ఆటోలో ఉన్న ఓ ఆటో డ్రైవర్‌ కి తీవ్ర గాయాలు అయ్యాయి. అతని కాలుకి తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటిన అతన్ని హాస్పిటల్ కి తరిలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ధ్రువ్‌ కారును స్వాధీనం తీసుకోని అతని పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. కాగా ఈ సంఘటన పై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

X
More