మంచు లక్ష్మికి రిక్వెస్ట్ ట్వీట్ పెట్టిన స్టార్ హీరో !

Published on Jul 11, 2018 2:13 pm IST

జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘కాట్రిన్‌ మొళి’ చిత్రంలో మంచు లక్ష్మి ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. రాధా మోహన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోఫ్తా మీడియా వర్క్స్‌ పతాకం పై ధనుంజయన్‌ గోవింద్‌ నిర్మిస్తున్నారు. కాగా ఇటీవలే ఈ చిత్రంలో నటించడం గురించి మంచు లక్ష్మి స్పందిస్తూ ‘వావ్.. జ్యోతికతో పనిచేయడం అద్భుతం. తనలో ఎంతో గొప్ప టాలెంట్ ఉంది. నేనెప్పుడూ జ్యోతికకు పెద్ద అభిమానిని తన ట్వీట్‌ చేశారు.

కాగా మంచు లక్ష్మి తాజాగా మరో ట్వీట్ చేస్తూ ‘సూర్య కలిసినప్పుడల్లా మంచి మనిషి అనిపిస్తుంది పైగా నా అభిమాన నటుడు కూడా. అయితే ఇప్పుడు నా మనసును మార్చుకున్నాను. నేను ఎప్పటికీ 100 శాతం జ్యోతికకు అభిమానిని’’ అని ట్వీట్‌ చేశారు లక్ష్మి.

ఐతే మంచు లక్ష్మి ట్వీట్‌ కి హీరో సూర్య రిప్లై ఇస్తూ..‘జ్యోతికతో నీకున్న అనుబంధాన్ని చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. కాట్రిన్ మొళి సెట్స్‌ పై నువ్వే లైఫ్ అని జ్యోతిక చెప్తూ ఉంటుంది. చెన్నైలో మేం ఇంతవరకు చూడని బెస్ట్ ప్లేసెస్‌ని చూపించినందుకు థ్యాంక్స్. దయచేసి నన్ను కూడా నీ ఫేవరెట్ లిస్ట్‌లో ఉండనివ్వు లక్ష్మి’ అంటూ సూర్య సరదాగా ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం :