వరద బాధితుల కోసం 25లక్షల విరాళం ప్రకటించిన స్టార్ హీరోలు !

వరద బాధితుల కోసం 25లక్షల విరాళం ప్రకటించిన స్టార్ హీరోలు !

Published on Aug 11, 2018 5:57 PM IST

Karthi Surya

దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన కేరళను కొన్ని రోజులుగా వానలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురసున్న వర్షల వల్ల వరదలు పోటెత్తి చాలా మంది నిరాశ్రులయ్యారు. అక్కడి ప్రజలు తిండి లేక ఉండడానికి ఇల్లు లేక నరకం చూస్తున్నారు. గత 3రోజులు గా పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే కేరళ లోని కొన్ని జిలాల్లో రెడ్ అలెర్ట్ ను ప్రకటించారు.

ఇక అక్కడి ప్రజలు పడుతున్న ఇక్కట్లు తెలుసుకొని వరద బాధితుల సహాయార్థం తమిళ స్టార్ హీరోలు అన్నదమ్ములు సూర్య, కార్తీ రూ. 25లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. ఇక మరో హీరో విశాల్ కూడా వరద బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.

తాజా వార్తలు