ఆభారీ చిత్రం కోసం జుట్టుపెంచే పనిలోపడ్డ స్టార్ హీరోస్

Published on Sep 21, 2019 1:18 pm IST

దేశం గర్వించ దగ్గ దర్శకులలో మణిరత్నం ఒకరు. ఈ సెన్సేషనల్ డైరెక్టర్ “పొన్నియిన్ సెల్వం ” పేరుతో ఓ భారీ చిత్రం తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ పీరియాడిక్ చిత్రం పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో విడుదల కానుంది. దర్శకుడు మణిరత్నం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేపనిలో ఉన్నారని సమాచారం.

చియాన్ విక్రమ్, కార్తీ, విజయ్ సేతుపతి, జయంరవి,పార్తీబన్, ఐశ్వర్య రాయి,కీర్తి సురేష్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కనున్న చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కొరకు విక్రమ్, కార్తీ, జయం రవి, విజయ్ సేతుపతి జుట్టు పెంచే పనిలో పడ్డారట. పీరియాడిక్ మూవీ కావడంతో పాత్రలకు పొడవాటి జులపాలు అవసరం అవడంతో మణిరత్నం ఆదేశాల మేరకు వారు ఈపనిలో ఉన్నారని వినికిడి. ఐతే ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకెళ్లే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :

X
More