లండన్లో మొదలుకానున్న స్టార్ హీరో సినిమా !

Published on May 29, 2018 11:35 am IST

దక్షిణాది స్టార్ హీరో సూర్య తన 37వ సినిమాను కెవి.ఆనంద్ దర్శకత్వంలో చేయనున్నారు. కెవి. ఆనంద్ గతంలో సూర్యతో ‘బ్రదర్స్, వీడొక్కడే’ వంటి ఆసక్తికరమైన చిత్రాల్ని తెరకెక్కించారు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలోను మొదలైంది. పైగా ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కూడ నటిస్తుండంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఇంకాస్త పెరిగిపోయింది.

ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ ను జూన్ ఆఖరి వారంలో లండన్లో మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాలో తెలుగు యువ హీరో అల్లు శిరీష్ కూడ ఒక కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు, ఇతర సాంకేతిక నిపుణులు ఎవరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే సూర్య ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ‘ఎన్.జి.కే’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :