
‘శంకరాభరణం’.. హ్యాట్రిక్ హిట్స్‌తో జోరు మీదున్న నిఖిల్ హీరోగా, ప్రముఖ కథా రచయిత కోన వెంకట్ స్క్రిప్ట్ సమకూర్చడంతో పాటు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ రూపొందించిన సినిమా. ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో క్రైమ్ కామెడీ జానర్లో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ సీజన్‌కు రానున్న సినిమాల్లో ఒక క్రేజీ ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్స్ ఈ సినిమాకు భారీ అంచనాలను తెచ్చిపెట్టగా ఈ సినిమాకు పలువురు టాప్ హీరోలు ప్రచారం కల్పించడం మరింత హైప్ తెచ్చిపెట్టింది.
మొదట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా టీజర్‍ను లాంచ్ చేసి ‘శంకరాభరణం’ టీమ్‌కు విషెస్ చెప్పగా, ఆ తర్వాత రానా కూడా ఓ సాంగ్‌ను లాంచ్ చేసి సినిమాకు ప్రచారం కల్పించారు. తాజాగా ఈ క్రమంలో లవర్ బాయ్ నాగ చైతన్య శంకరాభరణం సినిమాకు సంబంధించిన థీమ్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఆడియోలో లేని ఈ సాంగ్‌ను రేపు సాయంత్రం నాగచైతన్య ప్రత్యేకంగా శంకరాభరణం టీమ్ కోరిక మేరకు విడుదల చేయనున్నారు. ఇలా స్టార్ హీరోలంతా ఈ సినిమా కోసం స్వయంగా ప్రచారం కల్పించడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఉదయ్ నందనవనం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 4న పెద్ద ఎత్తున విడుదల కానుంది.

