మళ్ళీ సినిమాల్లోకి వస్తున్న స్టార్ హీరోయిన్ !

Published on Jul 11, 2018 8:49 am IST

ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‎ క్రికెట్ జట్టుకు అంబాసిడర్‎ గా, ప్రస్తుతం బిజీగా ఉన్న ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీజింతా మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఓ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రీతీజింతా నటించిన సినిమా ‘భయ్యాజీ సూపర్ హిట్’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‎ను విడుదల చేశారు. ఏడేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కొన్ని కారణాలు వల్ల ఇప్పటికి పూర్తి అయింది.

కాగా ‘భయ్యాజీ సూపర్ హిట్’ చిత్రాన్ని ఈ దసరాకు రిలీజ్ చేయడానికి చిత్రబృందం తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది. ఐతే ప్రీతీజింతా తెలుగులో విక్టరీ వెంకటేష్ తో ‘ప్రేమించుకుందాం రా’ చిత్రంలోనూ, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘రాజకుమారుడు’ చిత్రంలోనూ హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం :