వరుస హిట్లతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్న ‘సమంత’ త్వరలో ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా వెబ్ సిరీస్ లను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. పైగా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ వెబ్ సిరీస్‌ల ట్రెండ్ పెరుగుతుండటంతో సినీ స్టార్స్ కూడా వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
కాగా ఇటీవలే రాజ్ డీకే దర్శకత్వంలో సందీప్ కిషన్, ప్రియమణి, మనోజ్ బాజ్‌పాయ్ మెయిన్ పాత్రల్లో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ మంచి హిట్ అయింది. ఈ సిరీస్ కు బాగా రెస్సాన్స్ రావటంతో.. ఈ సిరీస్ ను కంటిన్యూ చేయనున్నారు. ఈ సిరీస్ రెండో సీజన్ లోనే సమంత ముఖ్య పాత్రలో నటిస్తోందట. పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలతో భారీ హిట్స్ అందుకుంటున్న సమంత.. మరి డిజిటల్ రంగంలో కూడా భారీ సక్సెస్ కొడుతుందేమో చూడాలి.


