ప్రభాస్ తో నటించాలని ఉందంటున్న స్టార్ హీరోయిన్ !


‘బాహుబలి’ విజయం తర్వాత హీరో ప్రభాస్ స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఆయనతో పనిచేయడానికి పెద్ద పెద్ద నిర్మాతలు, దర్శకులే కాక స్టార్ హీరోయిన్లు సైతం మొగ్గుచూపుతున్నారు. అలాంటి హీరోయిన్లలో తెలుగు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడ ఉన్నారు.

తాజాగా సొంత యాప్ ను లాంచ్ చేసిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో మీరు దాదాపు అందరు హీరోలతో వర్క్ చేశారు కదా ప్రత్యేకంగా ఎవరితోనైనా నటించాలని అనుకుంటున్నారా అనే ప్రశ్న రాగానే రకుల్ వెంటనే ప్రభాస్ అని, ఇంతవరకు ఆయనతో కలిసి నటించలేదు కాబట్టి చేయాలని ఉందని సమాధానమిచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ చిత్ర పనుల్లో ఉండగా రకుల్ సూర్య, కార్తి, శివ కార్తికేయన్, అజయ్ దేవగన్ వంటి హీరోలతో సినిమాలు చేస్తున్నారు.