మెగా హీరో మూవీలో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?
Published on Jun 24, 2018 4:26 pm IST

‘రంగస్థలం’ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రామ్ చరణ్ తన 12 వ చిత్రాన్ని యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తోన్నారు. ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఓ ప్రత్యేక మైన సాంగ్ ఉందట. ఆ సాంగ్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆడిపాడనుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే రకుల్, బోయపాటి దర్శకత్వంలో రెండు చిత్రాలను చేసింది. రామ్ చరణ్ సరసన కూడా ధ్రువ చిత్రంలో నటించింది.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఈ చిత్ర నిర్మాత డి వి వి దానయ్య అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook