ఎన్టీఆర్ సినిమాలో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ ?
Published on May 28, 2018 5:51 pm IST

జూ.ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో రూపొందుతున్న చిత్రం ‘అరవింద సమేత’. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారక్ సిక్స్ ప్యాక్ లుక్ తో అలరించనున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు కూడ మంచి స్పందన లభించింది. ‘అజ్ఞాతవాసి’ చిత్ర పరాజయంతో ప్రేక్షకుల్ని నిరాశపరచిన మాటల మాంత్రికుడు ఈ చిత్రంతో తనలోని మ్యాజిక్ ను తిరిగి చూపించాలనుకుంటున్నారు.

తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందని, అందులోకి స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను తీసుకోవాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేసున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు. గతంలో కాజల్ ఎన్టీఆర్ చేసిన ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో పక్కా లోకల్ అనే ప్రత్యేక గీతంలో ఆడి పాడగా ఆ పాట ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook