నిర్మాత అవతారం ఎత్తనున్న తాప్సీ?

నిర్మాత అవతారం ఎత్తనున్న తాప్సీ?

Published on Apr 24, 2015 11:05 AM IST

taapsee
తన అందం, నటనతో తెలుగులో వరుస సినిమాలతో ఆకట్టుకున్న తాప్సీకి ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ అవకాశాలు వచ్చి పడ్డాయి. తెలుగు తమిళ, హిందీ సినిమా అవకాశాలతో నటిగా బిజీ బిజీగా మారిపోయిన తాప్సీ త్వరలోనే మరో అవతారం ఎత్తనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ కేవలం నటనకే పరిమితమైన తాప్సీ ఇప్పుడు ఏకంగా నిర్మాతగా మారి సినిమా నిర్మాణంలో పాలుపంచుకోనున్నట్లు సమాచారం. అది కూడా ఓ బాలీవుడ్ సినిమా కావడం విశేషం.

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కి, 2011లో విడుదలై ఘన విజయం సాధించిన సినిమా ‘కాంచన’. తెలుగు, తమిళ భాషల్లో సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ సినిమాను ప్రస్తుతం హిందీలో తెరకెక్కించే ఆలోచనలో ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ ఉన్నారు. ఈ సినిమాకు తాప్సీ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారన్నది టాక్. తాప్సీ తాజాగా ‘కాంచన’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ‘కాంచన 2’లో హీరోయిన్‌గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు