అమెరికా డాక్టర్ ని పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్ ?

Published on Jul 24, 2018 3:54 pm IST

ముప్పై దాటికా గాని హీరోయిన్లలో చాలామందికి పెళ్లి మీద మనసు మళ్ళదు. అది కూడా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా హఠాత్తుగా ఏ ‘ఎన్.ఆర్.ఐ’నో, ఏ బిజినెస్ మ్యాన్ నో పెళ్లి చేసుకుని తమ అభిమానులకు సడెన్ షాక్ ఇస్తారు. అభిమానులకు షాక్ ఏమో గాని, హీరోయిన్లు మాత్రం పెళ్లి తర్వాతే జీవితంలో స్థిరపడతారు.

కాగా, ఇప్పుడు మిల్కీబ్యూటీ తమన్నా కూడా ఈ లిస్ట్ లోకి చేరిపోయింది. తమన్నా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, ఇప్పటికే వరుడుని కూడా చూశారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం వరుడు డాక్టర్‌ అని, అమెరికాలో ఉంటాడని తెలుస్తోంది. పైగా అక్కడ పెళ్లి కొడుక్కి చాలా వ్యాపారాలు ఉన్నాయట. త్వరలోనే ఈ జంట ఒక్కటవనున్నారు. నిశ్చితార్ధానికి కూడా ముహూర్తాలు చూస్తున్నారని సమాచారం. మరి పెళ్ళి తరువాత తమన్నా అమెరికా వెళ్ళిపోతుందో లేక ఇక్కడే ఉండి సినిమాలను కంటిన్యూ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :