రజినీ తో నటించనున్న స్టార్ హీరోయిన్ ?

రజినీ తో నటించనున్న స్టార్ హీరోయిన్ ?

Published on Jun 17, 2018 1:38 AM IST

కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం డార్జిలింగ్లో జరుగుతోంది. ఇక ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటించే అవకాశాలు వున్నాయట ఇటీవల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కాజల్ కు ఈ చిత్ర కథను వినిపించారట ఆమె తన నిర్ణయాన్ని వెల్లడించలేదని సమాచారం . ప్రస్తుతం కాజల్ చేతిలో కూడా ఒకటి ,రెండు సినిమాలు తప్ప పెద్దగా ఏమి లేవు . మరి కాజల్ ఈ సినిమాలో తలైవా తో నటించడానికి అగీకరిస్తుందో చూడాలి .

తమిళ స్టార్ నటులు విజయ్ సేతుపతి , బాబీ సింహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు . యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్నీ సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు