బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమార్తె ‘ఐరాఖాన్’ తాను దేనికీ పనికి రాననే ఫీలింగ్ వచ్చింది అంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. తనకు 25 ఏళ్లు దాటినా రూపాయి సంపాదన లేదని, ఏ పని చేయకుండా ఎలాంటి సంపాదన లేకుండా జీవిస్తున్నందుకు తాను బాధపడుతున్నానని, ఒక్కోసారి తను నిరాశలో ఉండిపోతాను అని, ఈ ప్రపంచంలో తాను దేనికీ పనికి రాననే ఫీలింగ్ వస్తోందని ఐరా ఖాన్ కామెంట్స్ చేసింది. తన తండ్రి అమీర్ ఖాన్ తో కలిసి ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
కాగా తన కూతురి వ్యాఖ్యలపై అమీర్ ఖాన్ స్పందిస్తూ.. ‘ఐరా చిన్న వయసులోనే ఎంతో మందికి సాయం చేసేది. తను చాలా మంచిది. అది తనకెంతో ఇష్టం అని, డబ్బు కంటే చేసే పనులతోనే పేరు వస్తుందని’ అమీర్ ఖాన్ తన కూతుర్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇక ఆ మధ్య ఐరా ఖాన్ కూడా హీరోయిన్గా పరిచయం కాబోతుందని వార్తలు వచ్చాయి. మరోవైపు ఇప్పటికే నుపుర్ శిఖారే అనే ఫిట్ నెస్ ట్రైనర్ తో ఐరా ప్రేమలో పడి, అతన్ని పెళ్లి కూడా చేసుకున్న సంగతి తెలిసిందే.