న్యూ ఇయర్ రోజు సప్రైజ్ ఇవ్వనునున్నస్టార్ హీరోలు !

Published on Dec 30, 2018 11:42 am IST

2019 జనవరి 1 ప్రత్యేకమైన రోజు కావడంతో ఆ రోజు స్టార్ హీరోలు నటిస్తున్న బడా చిత్రాలనుండి అప్డేట్స్ వెలుబడనున్నాయ్. అందులో భాగంగా నాని నటిస్తున్న ‘జెర్సీ’ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుందని ఇప్పటికే అధికారంగా ప్రకటించారు చిత్ర యూనిట్.

ఇక నా పేరు సూర్య తరువాత చాలా గ్యాప్ తీసుకొన్న అల్లు అర్జున్ ఎట్టకేలకు తన 19వ చిత్రాన్ని కూడా అదే రోజు ప్రకటించనున్నారు. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనే ఉత్కంఠ తో ఎదురుచూస్తున్నారు బన్నీ అభిమానులు.

ఈ సినిమాలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం మహర్షి నుండి కూడా ఒక పోస్టర్ ను విడుదలచేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. ముందస్తుగా ఈ విషయంఫై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయిన న్యూ ఇయర్ రోజు పోస్టర్ విడుదల చేసి మహేష్ ఫ్యాన్స్ ను థ్రిల్ చేయాలని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాలతో పాటు మరి కొన్ని సినిమాలనుండి కూడా అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక కోలీవుడ్ విషయానికి వస్తే స్టార్ హీరో సూర్య నటిస్తున్న 37వ చిత్రం యొక్క టైటిల్ ను కూడా అదే రోజు ప్రకటించనున్నారు. ఈ సినిమాతో పాటు మచ్ అవైటెడ్ మూవీ ‘ఎన్ జి కె’ నుండి అప్డేట్ వెలుబడే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత సమాచారం :