భారీ తారాగణం నడుమ ‘ఈ నగరానికి ఏమైంది’ ప్రీ రిలీజ్ ఈవెంట్ !
Published on Jun 25, 2018 12:51 pm IST

తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం ఈ నెల 29న విడుదలకానున్న సంగతి తెలిసిందే. దీంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రాల్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్ని అలరించిన టీమ్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనుంది.

ఈ వేడుకకు రానా దగ్గుబాటి, అక్కినేని నాగ చైతన్య, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలతో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడ హాజరుకానున్నారు. హైదరాబాద్లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఈ వేడుక జరగనుంది.

విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కాకుమాను, అభినవ్ గోమటంలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించారు. ప్రముఖ నిర్మాత సురేష్ దగ్గుబాటి నిర్మించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి పాజిటివ్ బజ్ నెలకొని ఉంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook