స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ రెండవ చిత్రం మొదలుకానుంది.

Published on Jan 19, 2020 11:00 pm IST

స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ తన రెండవ చిత్రానికి సిద్ధమయ్యారు. యంగ్ హీరో అరుణ్ అదిత్ కి జంటగా ఈమె ఓ కామెడీ థ్రిల్లర్ లో నటించనున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమం రేపు హైదరాబాద్ లో టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరగనుంది. దర్శకుడు దుర్గా నరేష్ గుట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సీనియర్ హీరోయిన్ ఇంద్రజ ఓ కీలక రోల్ చేస్తున్నారు. ఎస్ కె ఎస్ క్రియేషన్స్ బ్యానర్ లో శివ దినేష్ రాహుల్, అయ్యర్ నకరకాంతి నిర్మిస్తున్నారు.

కోట శ్రీనివాసరావు, పోసాని, సత్య, అజయ్ ఘోష్, అజయ్, జయప్రకాష్ రెడ్డి నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇక గత ఏడాది దొరసాని చిత్రంతో వెండితెరకు పరిచయమైనా రాజశేఖర్, జీవిత ల చిన్న కూతురు శివాత్మిక దొరగారి కూతురు దేవకిగా మెప్పించింది. ఆ పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది.

సంబంధిత సమాచారం :

X
More