ప్రముఖ ఛానల్ చేతికి పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ శాటిలైట్ రైట్స్ !

Published on Jan 22, 2019 11:33 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లవ్ ఎంటర్టైనర్ ‘తొలిప్రేమ’ లవ్ స్టోరీ మూవీస్ లో కొత్త ట్రెండ్ సృష్టించింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఈ చిత్రం కల్ట్ సినిమా గా మిగిలిపోయింది అంతేకాకుండా ఓవర్ నైట్ లో పవన్ ను స్టార్ హీరో ను చేసింది ఈ చిత్రం. 1998 లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ ఎన్ని సార్లు టీవీ ల్లో వచ్చిన అదిరిపోయే రేటింగ్స్ వస్తాయి. ఇక తాజాగా ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా సొంతం చేసుకుంది. ఇంతకుముందు ఈచిత్రాన్ని జీ తెలుగు ప్రసారం చేసింది.

ఏ కరుణాకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కీర్తి రెడ్డి కథానాయికగా నటించింది. ఎస్ఎస్ సి ఆర్ట్స్ పతాకం ఫై జి వి జి రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవా సంగీతం అందించాడు.అప్పట్లో ఈ చిత్రం యొక్క ఆడియో కూడా సెన్సేషన్ సృష్టించింది.

సంబంధిత సమాచారం :