అనారోగ్యంగా ఉన్న డా.డి. రామానాయుడు.?

అనారోగ్యంగా ఉన్న డా.డి. రామానాయుడు.?

Published on Dec 25, 2014 3:20 PM IST

Rama-Naidu
ఈ మధ్య కాలంలో కొన్ని నిర్మాణ సంస్థలు ఎప్పుడు మొదలవుతున్నాయి, ఎప్పుడు అంతమొందుతున్నాయి అనేది వారికే తెలియడంలేదు. అలాంటిది ఒక నిర్మాణ సంస్థని సమర్ధవంతంగా మరియు సక్సెస్ఫుల్ గా 50 సంవత్సరాలు నడపడం అనేది మామూలు విషయం కాదు. అలాంటి ఘనతని మూవీ మొఘల్ డా. డి. రామానాయుడుకి మాత్రమే దక్కింది. ప్రస్తుతం తెలుగు పరిశ్రమ ఈ స్థాయిలో ఉందని చెప్పుకోవడానికి ప్రధాన కారకులైన వారి లిస్టులో రామానాయుడు పేరు మొదట్లో ఉంటుంది.

గత కొద్ది రోజులుగా చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ లో ఆయన కనిపిచడం లేదు. ఈ విషయం పై ఆరాతీస్తే ఆయన కాస్త అనారోగ్యంగా ఉండడం వల్ల బయటకి రావడం లేదని తెలిసింది. సురేష్ ప్రొడక్షన్స్ వారు అంతకన్నా ఎక్కువగా విషయాన్ని బయటకి తెలియకుండా చూస్తున్నారు. మేము ఎప్పటికప్పుడు ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం.. అందుకే మమల్ని ఫాలో అవుతూ ఉండండి..

తాజా వార్తలు