దిల్ రాజు చేతుల్లోకి.. ‘అతడే శ్రీమన్నారాయణ’ !

Published on Dec 18, 2019 5:19 pm IST

కన్నడ హీరో రక్షిత్ శెట్టి పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయంలేకపోయినా ఆయన కొత్త సినిమా ‘అతడే శ్రీమన్నారాయణ’ పై తెలుగు ప్రేక్షుకుల్లో కూడా బాగానే ఆసక్తి ఉంది. టీజర్ ఇంట్రస్టింగ్ గా ఉండటంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. ఇక ఈ చిత్రం 2020 జనవరి 1న విడుదల కానుంది. అయితే ప్రత్యేకత ఏమిటంటే ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమాకి ఇంకా క్రేజ్ పెరుగనుంది.

ఇక ఈ సినిమాను కన్నడం, తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ‘కె.జి.ఎఫ్’ సినిమా ద్వారా కన్నడ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి గుర్తింపు రావడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. మరి ‘కె.జి.ఎఫ్’లాగే ఈ సినిమా కూడా ఇతర భాషల్లో కూడా .. అన్ని వర్గాల ప్రేక్షుకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More